డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు నెల రోజులు కూడా పూర్తికాకుండానే దెబ్బతింది. సుమారు 100 మీటర్ల మేర రోడ్డు రెండు ముక్కలుగా విడిపోయి, భూకంపం వచ్చినట్టుగా మధ్యలో చీలిపోయి ఒక వైపు దిగబడిపోయింది. భారీ వర్షాల అనంతరం రోడ్డు నిర్మాణంలోని నాణ్యతా లోపాలు బయటపడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్డు ఇంత తక్కువ సమయంలోనే ఇలా దెబ్బతినడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రోడ్డును పరిశీలించి, నిర్మాణ నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Uploaded Video:


