Saturday, 9 May 2026
  • Home  
  • ప్రభుత్వ భూముల కబ్జాలపై చిట్వేల్‌లో సీపీఐ ఆందోళన
- తిరుపతి

ప్రభుత్వ భూముల కబ్జాలపై చిట్వేల్‌లో సీపీఐ ఆందోళన

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం చిట్వేల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీపీఐ మండల నాయకుడు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ మైలపల్లి పంచాయతీ పరిధిలోని ఎం.గోలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 490/2లో ఉన్న 1.50 ఎకరాల ప్రభుత్వ భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ, అధికారులు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోర్టులో విచారణలో ఉన్న భూమిలో జేసీబీలతో చెట్లు తొలగించి స్థలం చదును చేయించడంలో చిట్వేల్ తహసీల్దార్ స్వయంగా పాల్గొన్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ భూములుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భూ సమస్యల పరిష్కారంలో ఎమ్మార్వో కార్యాలయం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలు సమర్పిస్తున్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు సరైన స్పందన లేదని, పేదలు మరియు దళితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఎమ్మార్వో కార్యాలయంలో భయభ్రాంతుల వాతావరణం నెలకొందని, అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని చిట్వేల్ తహసీల్దార్‌పై విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం చిట్వేల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీపీఐ మండల నాయకుడు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ మైలపల్లి పంచాయతీ పరిధిలోని ఎం.గోలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 490/2లో ఉన్న 1.50 ఎకరాల ప్రభుత్వ భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ, అధికారులు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కోర్టులో విచారణలో ఉన్న భూమిలో జేసీబీలతో చెట్లు తొలగించి స్థలం చదును చేయించడంలో చిట్వేల్ తహసీల్దార్ స్వయంగా పాల్గొన్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ భూములుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భూ సమస్యల పరిష్కారంలో ఎమ్మార్వో కార్యాలయం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
ప్రజలు సమర్పిస్తున్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు సరైన స్పందన లేదని, పేదలు మరియు దళితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఎమ్మార్వో కార్యాలయంలో భయభ్రాంతుల వాతావరణం నెలకొందని, అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని చిట్వేల్ తహసీల్దార్‌పై విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.