ముధోల్: 09ఆగస్టు(పున్నమి ప్రతినిధి )
బీడీ కార్మికులకు వృద్ధులకు పింఛన్లను మంజూరు చేయాలని ముధోల్ మండల బీజేపీ యువ నాయకులు తాటివార్ రమేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి బీడీ కార్మికులకు, వృద్ధులకు మొండిచేయి చూపించడం ఏమిటని ప్రశ్నించారు.ఎన్నో ఏళ్లుగా బీడీలను చూడుతూ కుటుంబాలను పోషించు కుంటున్న కార్మికులు ప్రస్తు తం తీవ్ర ఇబ్బందులతో శతమతమవుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామని హామీని ఇచ్చిందని ప్రస్తుతం అర్హులైన వారికి పింఛన్ మంజూరు చేయకపోవడం బాధాకరమైన విషయమని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వృద్ధులకు, బీడీ కార్మికులకు పింఛన్లను మంజూరు చేయాలని లేనియెడల ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకోవచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.



