ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఈ విషయాన్ని ఖమ్మం రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి సమస్యలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పర్యటనలో బాధితులతో సమావేశమై వారి నుంచి వివరాలు సేకరించి, తగిన నివేదికను ఉన్నత స్థాయికి సమర్పించే అవకాశం ఉందని మధు తెలిపారు.



