డాక్టర్ ప్రభాకర్ నాయుడే లేక పోతే కావలి లో సుబ్బారెడ్డి అనే నేను లేదనేది నగ్నసత్యం అని ప్రముఖ అనస్థీషియా వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ కావలి లో నాకు స్థానం కల్పించి తన శ్రీమతి పద్మజ గైనకాలజిస్ట్ గా స్థిరపడడానికి ప్రభాకర్ నాయుడు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. స్వంత బిడ్డ గా తనను భావించి ఆయన ప్రజా వైద్య శాలలో సుబ్బారెడ్డి అనే నన్ను ఈ స్ధాయిలో నిలబెట్టారని తెలిపారు. ఆయన ఇక్కడ కు రాలేక పోయినా ఇక్కడే ఉన్నట్లు అని సుబ్బారెడ్డి ఉద్వేగం కు గురి అయ్యారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన తాను వైద్య వృత్తిలో ఎదగడానికి ఆ తర్వాత తన శ్రీమతి పద్మజ అని తెలిపారు.ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో అమ్మ లేని నాకు అమ్మ గా అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు. ఇక కావలి లో నాటి తరం వైద్యులు, , నేటి తరం వైద్యులు ఇచ్చిన సహకారం తాను ఎదిగేందుకు సహకరించిందని తెలిపారు. ఇక కావలి వాసులు తనను స్వంత వాడిగా ఎంతో ఆప్యాయంగా చూశారని, తన శ్రీమతి పద్మజ గైనకాలజిస్ట్ గా నిలబడేందుకు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. కావలి వాసులు చూపే ప్రేమాభిమానాలతో స్వంత ఊరినే మరిచి పోయామని ఇలాంటి అదృష్టం తనకు లభించడం కావలి గ్రామదేవత కళుగోళమ్మ దయే అని తెలిపారు. సుబ్బారెడ్డి ఉద్యోగ విరమణ సభలో యమ్ యల్ ఎ క్రిష్ణా రెడ్డి, వైద్య రంగానికి చెందిన ప్రముఖులు, కావలి వైద్యులు భారీగా పాల్గొని సత్కరించారు.
సుబ్బారెడ్డి లాంటి అనస్థీషియన్ కావలి కి దొరకడం అదృష్టం అని కొనియాడారు. కావలి కి తొలి స్థిర అనస్థీషియన్ గా సుబ్బారెడ్డి ఎన్నో క్లిష్టమైన కేసు లలో వైద్యులు విజయం పొందేందుకు సహకరించారని, ఆయన ఉంటే ఆపరేషన్ ధియెటర్ లో ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదని డాక్టర్ ప్రభాకర్ నాయుడు తన అభినందన సందేశం లోపేర్కొన్నారు. తమ తండ్రి సుబ్బారెడ్డి స్వయంకృషితో కష్టపడి పైకి వచ్చారని, అయన బాటలో నే తాము కూడా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరడంలో కృషి చేస్తామని కుమారులు పృధ్వీ, రాహుల్ తెలిపారు.

ప్రభాకర్ నాయుడే కావలి లో నిలబెట్టారు డాక్టర్ సుబ్బారెడ్డి
డాక్టర్ ప్రభాకర్ నాయుడే లేక పోతే కావలి లో సుబ్బారెడ్డి అనే నేను లేదనేది నగ్నసత్యం అని ప్రముఖ అనస్థీషియా వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ కావలి లో నాకు స్థానం కల్పించి తన శ్రీమతి పద్మజ గైనకాలజిస్ట్ గా స్థిరపడడానికి ప్రభాకర్ నాయుడు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. స్వంత బిడ్డ గా తనను భావించి ఆయన ప్రజా వైద్య శాలలో సుబ్బారెడ్డి అనే నన్ను ఈ స్ధాయిలో నిలబెట్టారని తెలిపారు. ఆయన ఇక్కడ కు రాలేక పోయినా ఇక్కడే ఉన్నట్లు అని సుబ్బారెడ్డి ఉద్వేగం కు గురి అయ్యారు. సామాన్య కుటుంబంలో జన్మించిన తాను వైద్య వృత్తిలో ఎదగడానికి ఆ తర్వాత తన శ్రీమతి పద్మజ అని తెలిపారు.ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో అమ్మ లేని నాకు అమ్మ గా అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు. ఇక కావలి లో నాటి తరం వైద్యులు, , నేటి తరం వైద్యులు ఇచ్చిన సహకారం తాను ఎదిగేందుకు సహకరించిందని తెలిపారు. ఇక కావలి వాసులు తనను స్వంత వాడిగా ఎంతో ఆప్యాయంగా చూశారని, తన శ్రీమతి పద్మజ గైనకాలజిస్ట్ గా నిలబడేందుకు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. కావలి వాసులు చూపే ప్రేమాభిమానాలతో స్వంత ఊరినే మరిచి పోయామని ఇలాంటి అదృష్టం తనకు లభించడం కావలి గ్రామదేవత కళుగోళమ్మ దయే అని తెలిపారు. సుబ్బారెడ్డి ఉద్యోగ విరమణ సభలో యమ్ యల్ ఎ క్రిష్ణా రెడ్డి, వైద్య రంగానికి చెందిన ప్రముఖులు, కావలి వైద్యులు భారీగా పాల్గొని సత్కరించారు. సుబ్బారెడ్డి లాంటి అనస్థీషియన్ కావలి కి దొరకడం అదృష్టం అని కొనియాడారు. కావలి కి తొలి స్థిర అనస్థీషియన్ గా సుబ్బారెడ్డి ఎన్నో క్లిష్టమైన కేసు లలో వైద్యులు విజయం పొందేందుకు సహకరించారని, ఆయన ఉంటే ఆపరేషన్ ధియెటర్ లో ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదని డాక్టర్ ప్రభాకర్ నాయుడు తన అభినందన సందేశం లోపేర్కొన్నారు. తమ తండ్రి సుబ్బారెడ్డి స్వయంకృషితో కష్టపడి పైకి వచ్చారని, అయన బాటలో నే తాము కూడా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరడంలో కృషి చేస్తామని కుమారులు పృధ్వీ, రాహుల్ తెలిపారు.

