*ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్‌నగర్ జిల్లా తేదీ 07/0 8 /2026*
➡️ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల ధన్యవాదాలు
➡️ ప్రభుత్వ విప్ శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2028 సెప్టెంబర్‌లోగా ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని నిర్దేశించిన నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ వర్గాలు స్వాగతించాయి. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని* తెలంగాణ ఉపాధ్యాయుల తరఫున రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.ఎన్. విజయ కుమార్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు వారి సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రేస్ మార్కులు కేటాయించాలని ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.

