రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులతో పాటు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి, కొండం రాజిరెడ్డి, వెలుముల రాంరెడ్డి, ఆరుట్ల మహేష్, భానుకుమార్, రంజాని నరేష్, ఎదునూరి భానుచందర్, తలారి నర్సయ్య, కొప్పు రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులతో పాటు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి, కొండం రాజిరెడ్డి, వెలుముల రాంరెడ్డి, ఆరుట్ల మహేష్, భానుకుమార్, రంజాని నరేష్, ఎదునూరి భానుచందర్, తలారి నర్సయ్య, కొప్పు రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

