Tuesday, 8 September 2026
  • Home  
  • ప్రజలు టీడీపీ, వైఎస్ఆర్సీపీతో విసిగిపోయారు: విజయసాయిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలు టీడీపీ, వైఎస్ఆర్సీపీతో విసిగిపోయారు: విజయసాయిరెడ్డి

టీడీపీ, వైఎస్ఆర్సీపీ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఏర్పడిందని శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రెండు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటి మధ్య పోరులో ప్రజలు నలిగిపోతున్నారని ఆరోపించారు. పోలీసులు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా కాకుండా న్యాయం వైపు పనిచేయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భద్రత కంటే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన పనులకు రాజకీయ నాయకులు, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు మామూళ్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి సంపాదించుకోవడంపైనే కొందరు నాయకుల దృష్టి ఉందన్నారు. తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి ప్రజలే రాజకీయ మార్గదర్శకులని తెలిపారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అభ్యర్థులు కాదన్నారు. ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాల నుంచి ముఖ్యమంత్రి వచ్చేలా పార్టీ విధానం ఉంటుందని చెప్పారు. దసరా తర్వాత పార్టీని ప్రకటిస్తామని, జెన్‌జీకి 66 శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. రైతులకు, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

టీడీపీ, వైఎస్ఆర్సీపీ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఏర్పడిందని శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రెండు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయని పేర్కొన్నారు.
టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటి మధ్య పోరులో ప్రజలు నలిగిపోతున్నారని ఆరోపించారు. పోలీసులు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా కాకుండా న్యాయం వైపు పనిచేయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భద్రత కంటే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.
ప్రజలకు అందాల్సిన పనులకు రాజకీయ నాయకులు, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు మామూళ్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి సంపాదించుకోవడంపైనే కొందరు నాయకుల దృష్టి ఉందన్నారు.
తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి ప్రజలే రాజకీయ మార్గదర్శకులని తెలిపారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అభ్యర్థులు కాదన్నారు. ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాల నుంచి ముఖ్యమంత్రి వచ్చేలా పార్టీ విధానం ఉంటుందని చెప్పారు. దసరా తర్వాత పార్టీని ప్రకటిస్తామని, జెన్‌జీకి 66 శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. రైతులకు, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.