Sunday, 26 July 2026
  • Home  
  • చౌపన్ గూడలో ఓటరు నమోదుపై కాంగ్రెస్ అవగాహన
- News

చౌపన్ గూడలో ఓటరు నమోదుపై కాంగ్రెస్ అవగాహన

చౌపన్ గూడలో ఓటరు నమోదుపై కాంగ్రెస్ అవగాహన వాంకిడి, న్యూస్‌టుడే: వాంకిడి మండలంలోని చౌపన్ గూడ బూత్‌ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురుణులే నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా బీఎల్ఏ కమలాకర్‌తో కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై, “ఓటు మన హక్కు – ప్రజాస్వామ్యానికి మన బాధ్యత” అని పేర్కొంటూ ప్రతి అర్హుడూ ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ఫారమ్‌లను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌ఓకు అందజేయాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు

చౌపన్ గూడలో ఓటరు నమోదుపై కాంగ్రెస్ అవగాహన
వాంకిడి, న్యూస్‌టుడే: వాంకిడి మండలంలోని చౌపన్ గూడ బూత్‌ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురుణులే నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా బీఎల్ఏ కమలాకర్‌తో కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం గ్రామస్తులతో సమావేశమై, “ఓటు మన హక్కు – ప్రజాస్వామ్యానికి మన బాధ్యత” అని పేర్కొంటూ ప్రతి అర్హుడూ ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ఫారమ్‌లను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌ఓకు అందజేయాలని కోరారు.
ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.