Thursday, 17 September 2026
  • Home  
  • పేదరికాన్ని జయించి మెడికల్ సీటు సాధించిన బీరవోలు యువకుడు.. ఆర్థిక సహాయం చేసిన మాజీ శాసన సభ్యులు మార్తినేని ధర్మా రావు.
- ఖమ్మం

పేదరికాన్ని జయించి మెడికల్ సీటు సాధించిన బీరవోలు యువకుడు.. ఆర్థిక సహాయం చేసిన మాజీ శాసన సభ్యులు మార్తినేని ధర్మా రావు.

తిరుమలాయపాలేం / ఖమ్మం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరవోలు గ్రామానికి చెందిన పి. సాయి వరుణ్ ముదిరాజ్ నీట్ (NEET) పరీక్షలో ప్రతిభ కనబరిచి, ప్రముఖ కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందులు ఆయన వైద్య విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అండగా నిలిచారు. సాయి వరుణ్ ఉన్నత చదువుల కోసం తక్షణ సహాయంగా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన సాయి వరుణ్‌ను ధర్మారావు అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు వైద్య విద్యలో రాణించడం బీరవోలు గ్రామానికే కాకుండా మొత్తం ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రుద్ర ప్రదీప్, పాలేరు నియోజకవర్గ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్న రవికుమార్, ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు.

తిరుమలాయపాలేం / ఖమ్మం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరవోలు గ్రామానికి చెందిన పి. సాయి వరుణ్ ముదిరాజ్ నీట్ (NEET) పరీక్షలో ప్రతిభ కనబరిచి, ప్రముఖ కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందులు ఆయన వైద్య విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అండగా నిలిచారు. సాయి వరుణ్ ఉన్నత చదువుల కోసం తక్షణ సహాయంగా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన సాయి వరుణ్‌ను ధర్మారావు అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు వైద్య విద్యలో రాణించడం బీరవోలు గ్రామానికే కాకుండా మొత్తం ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.
కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రుద్ర ప్రదీప్, పాలేరు నియోజకవర్గ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్న రవికుమార్, ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.