ఆత్మకూరు :బసవరాజుపాళెం గ్రామంలో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంలో గ్రామ యువత, భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు. మొదటి లడ్డూ వేలం పాటలో చాట్ల వెంకటేష్ రూ.15,000లకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం జరిగిన రెండో లడ్డూ వేలం పాటలో రెడ్డిపోగు బ్రదర్స్ రూ.30,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. రెడ్డిపోగు కళ్యాణ్, రెడ్డిపోగు నాని, రెడ్డిపోగు రవి కలిసి రెండో లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలం కార్యక్రమం సందడిగా సాగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

బసవరాజుపాళెంలో ఘనంగా లడ్డూ వేలం.