Thursday, 6 August 2026
  • Home  
  • ధరల భారం తగ్గించాలి.. ప్రజా సమస్యలపై సిపిఐ పాదయాత్ర
- అనకాపల్లి

ధరల భారం తగ్గించాలి.. ప్రజా సమస్యలపై సిపిఐ పాదయాత్ర

అనకాపల్లి, ఆగస్టు 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అనకాపల్లిలో నెహ్రూ చౌక్ నుంచి ప్రచార పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. పేదలకు ఉచితంగా లేదా అందుబాటు ధరల్లో విద్య, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి పార్టీ ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా, యువజన విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.

అనకాపల్లి, ఆగస్టు 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ):
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అనకాపల్లిలో నెహ్రూ చౌక్ నుంచి ప్రచార పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. పేదలకు ఉచితంగా లేదా అందుబాటు ధరల్లో విద్య, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి పార్టీ ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా, యువజన విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.