Monday, 18 May 2026
  • Home  
  • పెంచిన ఇంధన ధరలపై వైఎస్సార్సీపీ నిరసన
- తిరుపతి

పెంచిన ఇంధన ధరలపై వైఎస్సార్సీపీ నిరసన

శ్రీ కాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తి ఆర్టీవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి, పవిత్ర రెడ్డి బియ్యపు ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆర్టీవో కార్యాలయ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శాంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ….పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని మండిపడ్డారు. రోడ్డు డెవలప్‌మెంట్ సెస్ పేరుతో అదనపు భారం మోపడం వల్ల ప్రజలపై రూ. 3,391 కోట్ల ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శ్రీకాళహస్తిలో ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకుంటూ ‘పోలీస్ రాజ్యాంగం’ నడిపిస్తున్నారని విమర్శించారు. రాజకీయ విద్వేషాలతో ఎటువంటి నోటీసులు లేకుండా 24 మున్సిపల్ దుకాణాలను మూసివేశారని, తాము నిలదీయడంతో 21 దుకాణాలు తెరిచారని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పట్టణంలోని అధికార పార్టీ బ్యానర్లను 24 గంటల్లోగా తొలగించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, మాజీ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు, వయ్యాల మనోహర్ రెడ్డి, కొత్తపాటి శ్రీనివాసులు రెడ్డి, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, నాయకులు కంట ఉదయ్ కుమార్, ముని కృష్ణారెడ్డి, పులి రామచంద్ర, మధు రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.