Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. ఉన్నత భవిష్యత్తుకు బాటలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. ఉన్నత భవిష్యత్తుకు బాటలు!

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి శాఖా గ్రంథాలయంలో శనివారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సి.హెచ్.
  • శ్రీనివాసరావు పాల్గొన్నారు.

యలమంచిలి శాఖా గ్రంథాలయంలో శనివారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే గ్రంథాలయాలకు వెళ్లడం, పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. చదువుతో పాటు పుస్తక పఠనం అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. గ్రంథాలయాధికారి వి. ఆనంద్ మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ ఆడారి పూరి జగన్నాధం అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సోమయాజుల సన్యాసిబాబు, వై. అప్పారావు, కె. నటరాజ్, రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *