రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరిని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అభినందనలు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన పిల్లమార్రి మురళీకృష్ణ, కురగంటి సతీష్‌లను కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి మరింత సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.





