* వాసవి నగర్ లో రావి చెట్టు సెంటర్ లో తొలగించబడ్డ రబ్బిష్
* పారిశుధ్య స్పందన కు వందనం
ఆగష్టు నెల 22 వ తేదీ పున్నమి దిన పత్రిక లో స్వచ్ఛ నెల్లూరు అంటే ఇదేనా ? అన్న ప్రధాన శీర్షిక తో రోడ్ ల పై రబ్బిష్ నెలల తరబడిగా తొలగించని వైనం నగర పరిధిలో పారిశుధ్యం దిగజారుతోంది అన్న ఉప శీర్షికలతో వార్త ఫోటో లతో సహా ప్రచురించడం జరిగింది . 16 వ డివిజన్ వాసవి నగర్ రవి చెట్టు సెంటర్ 2 వ మెయిన్ రోడ్ కూడలిలో రబ్బిష్ తో నిండిన రోడ్ వార్తను సమగ్రంగా ప్రచురించడం జరిగింది . ఈ వార్త ప్రజలలో కి వెళ్లడం తో నెల్లూరు నగర్ కార్పొరేషన్ పారిశుధ్య అధికారులు స్పందించి వెంటనే రంగంలో దిగి సంబంధిత రోడ్ లోని రబ్బిష్ గుట్టలను తొలగించారు . దీనితో ఆ రోడ్ న వెళ్లే వాహన దారులు ప్రజలు తమ హర్షం వ్యక్తం చేసారు . పున్నమి వార్త పట్ల వారు కృతజ్ఞతలు తెలియ జేశారు సకాలంలో స్పందించిన పారిశుధ్య సిబ్బంది స్పందన కు తమ వందనం తెలిపారు



