సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@విశాఖపట్నం
విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాణ కేంద్రం నందు ఆదివారం సాయంత్రం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ37వ మరియు విశాఖరత్న కళాపరిషత్27వ వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు 2025 సంవత్సరానికి గాను ప్రముఖుల పేరుమీద అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. అధ్యాపకుడిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన మా కమిటీ ఈ అవార్డుకి పీర్ కుమార్ ని ఎంపిక చేసిందని కళా పరిషత్ నిర్వహకులు కళా భూషణ్ డాక్టర్ పి.ఎ. భాస్కర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, విశాఖపట్నం సినీ దర్శకులు, ఎన్.టి.ఆర్. అవార్డు గ్రహీత దుగ్గివలస దివాకర్, ఆంధ్రా యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ డా|| కెంబూరి చంద్రమౌళి, హైదరాబాద్ న్యాయవాధి డా॥ కట్టా లక్ష్మి, నాటక రచయిత, సినీ నటుడు, న్యాయనిర్ణేత పి.టి. మాదవ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్ లర్, ఆచార్య వి. బాలమోహన్ దాస్, SFX సినీస్టూడియో అధినేత, ఎన్.టి.ఆర్. అవార్డు గ్రహీత, పి. శ్యామ్ కుమార్, కళాసేవకులు, ఆంధ్ర తెలంగాణ ఎస్.ఆర్. ఛానల్ అధినేత సింగంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని అభినందించారు.

పీర్ కుమార్ కు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు
సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి@విశాఖపట్నం విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాణ కేంద్రం నందు ఆదివారం సాయంత్రం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ37వ మరియు విశాఖరత్న కళాపరిషత్27వ వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు 2025 సంవత్సరానికి గాను ప్రముఖుల పేరుమీద అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. అధ్యాపకుడిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన మా కమిటీ ఈ అవార్డుకి పీర్ కుమార్ ని ఎంపిక చేసిందని కళా పరిషత్ నిర్వహకులు కళా భూషణ్ డాక్టర్ పి.ఎ. భాస్కర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, విశాఖపట్నం సినీ దర్శకులు, ఎన్.టి.ఆర్. అవార్డు గ్రహీత దుగ్గివలస దివాకర్, ఆంధ్రా యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ డా|| కెంబూరి చంద్రమౌళి, హైదరాబాద్ న్యాయవాధి డా॥ కట్టా లక్ష్మి, నాటక రచయిత, సినీ నటుడు, న్యాయనిర్ణేత పి.టి. మాదవ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్ లర్, ఆచార్య వి. బాలమోహన్ దాస్, SFX సినీస్టూడియో అధినేత, ఎన్.టి.ఆర్. అవార్డు గ్రహీత, పి. శ్యామ్ కుమార్, కళాసేవకులు, ఆంధ్ర తెలంగాణ ఎస్.ఆర్. ఛానల్ అధినేత సింగంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని అభినందించారు.

