Tuesday, 30 June 2026
  • Home  
  • పి.వి. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత – రేపు పదవీ విరమణ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి.వి. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత – రేపు పదవీ విరమణ

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ : మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. జూన్ 30న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో GO Rt. No.1274 జారీ చేసి సేవల నుంచి రిలీవ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ తర్వాత కూడా కేసుల దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. పెన్షన్ ప్రయోజనాలు సంబంధిత నిబంధనల మేరకే అమలవుతాయని తెలిపింది. తదుపరి చర్యల కోసం డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు వెలువడగా, సస్పెన్షన్‌లోనే పదవీ విరమణకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ :
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.
జూన్ 30న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో GO Rt. No.1274 జారీ చేసి సేవల నుంచి రిలీవ్ చేసింది.
పెండింగ్‌లో ఉన్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
రిటైర్మెంట్ తర్వాత కూడా కేసుల దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.
పెన్షన్ ప్రయోజనాలు సంబంధిత నిబంధనల మేరకే అమలవుతాయని తెలిపింది.
తదుపరి చర్యల కోసం డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు వెలువడగా, సస్పెన్షన్‌లోనే పదవీ విరమణకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.