మెండోరా మండలం దూదిగం గ్రామానికి చెందిన షేక్ మెహబూబ్ ఇటీవల దుబాయ్ లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరం.
ఈరోజు వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, నా ప్రగాఢ సానుభూతి తెలియజేశాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం చెప్పి, నా వంతు అండగా నిలుస్తూ తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశాను.
అలాగే, గల్ఫ్ లో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అందే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా త్వరలోనే బాధిత కుటుంబానికి అందేలా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చాను.



