తూర్పుగోదావరిజిల్లా అమలాపురం :
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం ఆవరణ లో ఆర్.డి. ఓ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల కాలుష్యాల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆర్.డి. ఓ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమనేది భాద్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీనివాస్, కె .ఆర్. సి. తహసీల్దార్ జి. లక్ష్మీపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్తి నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.