పున్నమి ప్రతినిధి. షేక్ రసూల్ అహమద్ : భారతదేశంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 21 నాటికి దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా, మే 20 నాటికి 1,06,750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతదేశం కరోనా సంక్రమణ దశలో అడుగుపెట్టి కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారిపోయింది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు 3,500 కు పెరగగా, గత నాలుగు రోజుల్లో ( మే 17 నుంచి 20 వరకు ) రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే కొత్తగా 5,611 కేసులు నమోదయ్యాయి. ఇంతటి మహా సంక్షోభం నుంచి ఎలా బయటపడాలని గాని, కరోనాను ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ ప్రయత్నం రెండూ లేవు. గతంలో రోజూ సమీక్షలు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత 8 రోజులు నుంచి వీటికి స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. భారమంతా రాష్ట్రాలపై వేసి చేతులు దులుపుకొంటుంది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. తర్వాత మీడియాతో ఏ విధమైన కాంటాక్ట్ పెట్టుకోలేదు. దీనిపై అన్నివైపులా విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ మాట క్రమేపీ పాతబడిపోతోంది, బహుశా కరోనా వైరస్ తో సహజీవనం చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచనలాగా కన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో సమన్వయము లేకుండా అంతర్జాతీయ మెప్పు కోసమంటూ విశ్లేషకులకు సైతం అర్ధంకాని ఉద్దీపన చర్యలు చేపట్టి ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలగించివేసింది. రైళ్లు, బస్సులు, విమాన రాకపోకలపై నిషేధం ఎత్తి వేస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెంది వివిధ సమస్యలు తలెత్తే పరిస్థితులను అందరూ ఎదుర్కోవలసి వస్తుంది. ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉండి హావ్స్, హావనాట్స్ అంతరం మరింతగా పెరిగి భవిష్యతులో తీవ్ర అంతర్యుద్దాలకు దారి తీస్తోందా అన్న అనుమానాలు బీజం పోసుకొంటున్నాయి. పోనీ ఏదోరకంగా కేంద్ర ఆదుకొంటుంది అనుకుంటే, భారీ ప్యాకేజి అంటూ ఊరించి చివరికి వలస కార్మికుల, సామాన్యుల చేతిలో చిప్పలు పెట్టారని ప్రజలు వాపోతున్నారు. ఇంతటి లాక్ డౌన్ లోనే కరోనా విజృంభిస్తూ వుంటే ఇక ముందు ముందు ఎలావుంటుందో ఊహించడానికే భయమేస్తుంది. కాని ప్రభుత్వం మాత్రం దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెపుతూ ఏ విధంగానైనా లాభాలు గడించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటిలాగే మరొక్కసారి సామాన్య ప్రజలే సమిధలవుతారని చరిత్ర చెప్పకనే చెపుతుంది.
0 Comments
గౌస్ బాషా (జీబీ షా)
May 21, 2020ముందాలోచన లేని లాక్డ్ డవున్ వలన కోట్లాది ప్రజలు జీవహింసకు గురిఅయారు. వారిని కాపాడుటకు ప్రభుత్వానికి శూచనలివ్వండి
SHAIK RASOOL AHAMED
May 21, 2020yes sir. i agree with you