Saturday, 16 May 2026
  • Home  
  • ఇసుక వ్యాపారులపై అపోహలు తొలగాలి : ర్యాంపు నిర్వాహకులు
- తూర్పు గోదావరి

ఇసుక వ్యాపారులపై అపోహలు తొలగాలి : ర్యాంపు నిర్వాహకులు

తాళ్లపూడి, మే 16 (పున్నమి ప్రతినిధి): తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదని, భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామని పలువురు రీచ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే పుష్కరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు చేస్తున్నామని వారు తెలిపారు. అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు అవసరమైన సమయంలో ఇసుక అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే నిల్వలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఈ స్టాక్ పాయింట్ల ద్వారా లాభం వస్తుందా, లేక నష్టమే మిగులుతుందా అన్న అనిశ్చితి నెలకొన్నట్లు వాపోయారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయం సమయానికి ప్రభుత్వ ఖజానాకు చేరుతోందని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇసుక అమ్మకాలు మందగించడంతో కొన్ని ర్యాంపులు పూర్తిగా మూతపడిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాంపుల నిర్వహణ, యంత్రాల ఖర్చులు, కార్మిక వ్యయాలు, రవాణా భారం పెరిగిపోవడంతో నిర్వహణ చాలా కష్టసాధ్యంగా మారిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరలకు ఇసుక విక్రయాలు జరగడం వల్ల అధికారిక ర్యాంపుల అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. భారీ పెట్టుబడులు పెట్టినా సమాజంలో ఇసుక వ్యాపారులను అక్రమార్జన చేసే వారిగా ముద్ర వేయడం బాధాకరమని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు భూగర్భ గనుల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు రాత్రి వేళల్లో కూడా రీచ్‌ల వద్ద పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇసుక వ్యాపారంలో ఏది నిజం, ఏది అబద్ధమో అర్థంకాని పరిస్థితి నెలకొనడంతో వ్యాపారం ముందుకు వెనక్కి ఊగిసలాడుతోందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

తాళ్లపూడి, మే 16 (పున్నమి ప్రతినిధి): తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదని, భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామని పలువురు రీచ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే పుష్కరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు చేస్తున్నామని వారు తెలిపారు.
అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు అవసరమైన సమయంలో ఇసుక అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే నిల్వలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఈ స్టాక్ పాయింట్ల ద్వారా లాభం వస్తుందా, లేక నష్టమే మిగులుతుందా అన్న అనిశ్చితి నెలకొన్నట్లు వాపోయారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయం సమయానికి ప్రభుత్వ ఖజానాకు చేరుతోందని తెలిపారు.
ఇటీవలి కాలంలో ఇసుక అమ్మకాలు మందగించడంతో కొన్ని ర్యాంపులు పూర్తిగా మూతపడిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాంపుల నిర్వహణ, యంత్రాల ఖర్చులు, కార్మిక వ్యయాలు, రవాణా భారం పెరిగిపోవడంతో నిర్వహణ చాలా కష్టసాధ్యంగా మారిందన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరలకు ఇసుక విక్రయాలు జరగడం వల్ల అధికారిక ర్యాంపుల అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. భారీ పెట్టుబడులు పెట్టినా సమాజంలో ఇసుక వ్యాపారులను అక్రమార్జన చేసే వారిగా ముద్ర వేయడం బాధాకరమని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు భూగర్భ గనుల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు రాత్రి వేళల్లో కూడా రీచ్‌ల వద్ద పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇసుక వ్యాపారంలో ఏది నిజం, ఏది అబద్ధమో అర్థంకాని పరిస్థితి నెలకొనడంతో వ్యాపారం ముందుకు వెనక్కి ఊగిసలాడుతోందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.