ఖమ్మం: నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగ సాంబశివరెడ్డి కర్మ కార్యక్రమం ఆదివారం ఖమ్మం నగరము లో ని సీఖ్వెల్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ సందగర్భముగా ఏర్పాటు చేసిన
సంతాప సభలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సాంబశివరెడ్డి విద్యారంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి విద్యా, సామాజిక రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ, ఖమ్మం బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు పాల్గొని సాంబశివరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు



