అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త మట్టపర్తి గంగాధర్ అంతర్జాతీయ స్థాయిలో మెరిసి, మారుమూల గ్రామానికి గుర్తింపు తెచ్చాడు . ఈ నెల 22న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ( ఐఐటి )తిరుపతి ఎనిమిదవ స్నాతకోత్సవంలో గౌరవప్రదమైన పీహెచ్‌డీ డిగ్రీని అందుకున్నాడు .
గంగాధర్ గతంలో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో దమ్మసత్, రాజమంగళ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన “వనరుల సుస్థిరత” (ఐసీఆర్ స్ 2024) అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధనా ప్రసంగాన్ని వినిపించి ‘బెస్ట్ యంగ్ సైంటిస్ట్’ అవార్డును గెలుచుకున్నారు.గంగాధర్ తండ్రి రమేష్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా, తల్లి వాణి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని గంగాధర్ తెలిపారు.సాధారణ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి, ఐఐటీలో పీహెచ్‌డీ సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ యువ సైంటిస్ట్‌గా గుర్తింపు పొందిన గంగాధర్‌ను స్థానిక నాయకులు, అధికారులు గ్రామస్తులు అభినందించారు. గంగాధర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


