Sunday, 3 May 2026
  • Home  
  • నాడు ఆపదలో ఆదుకున్న కేటీఆర్ నేడు పదవ తరగతి పాసై కృతజ్ఞతతో కలిసిన శరణ్య
- రాజన్న సిరిసిల్ల

నాడు ఆపదలో ఆదుకున్న కేటీఆర్ నేడు పదవ తరగతి పాసై కృతజ్ఞతతో కలిసిన శరణ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా / మే 3 /పున్నమి ప్రతినిధి 2020 సంవత్సరంలో తన కుమార్తె శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అవసరమని శరణ్య తల్లి పూజిత గారు సోషల్ మీడియా ద్వారా అప్పటి మంత్రి కేటీఆర్ గారిని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గారు వెంటనే స్పందించి, శరణ్య సర్జరీకి అవసరమైన ఖర్చును అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ సహాయంతో విజయవంతంగా చికిత్స పొందిన శరణ్య ఆరోగ్యంగా కోలుకుంది. ఆరు సంవత్సరాల అనంతరం, తాజాగా 10వ తరగతి పూర్తి చేసిన శరణ్య కేటీఆర్ గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. తన జీవితంలో కొత్త వెలుగు నింపిన నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి లోనైంది. ఈ ఘటన అందరినీ హత్తుకుంటోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా / మే 3 /పున్నమి ప్రతినిధి

2020 సంవత్సరంలో తన కుమార్తె శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అవసరమని శరణ్య తల్లి పూజిత గారు సోషల్ మీడియా ద్వారా అప్పటి మంత్రి కేటీఆర్ గారిని వేడుకున్నారు.
విషయం తెలుసుకున్న కేటీఆర్ గారు వెంటనే స్పందించి, శరణ్య సర్జరీకి అవసరమైన ఖర్చును అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ సహాయంతో విజయవంతంగా చికిత్స పొందిన శరణ్య ఆరోగ్యంగా కోలుకుంది.
ఆరు సంవత్సరాల అనంతరం, తాజాగా 10వ తరగతి పూర్తి చేసిన శరణ్య కేటీఆర్ గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. తన జీవితంలో కొత్త వెలుగు నింపిన నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి లోనైంది. ఈ ఘటన అందరినీ హత్తుకుంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.