Saturday, 29 August 2026
  • Home  
  • *దోరవారిసత్రం మండలం అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలు – గ్రామస్తుల అవస్థలు*
- తిరుపతి

*దోరవారిసత్రం మండలం అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలు – గ్రామస్తుల అవస్థలు*

తిరుపతి జిల్లా, దోరవారిసత్రం మండలం, అక్కరపాకు గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో గ్రామం మొత్తం చీకటిమయంగా మారుతోంది. గ్రామంలో ప్రధాన వీధుల్లో ఉన్న స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా పాములు, తేళ్ల భయం, దొంగల భయం కూడా నెలకొంది. రాత్రిపూట వాహనదారులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై పంచాయతీ అధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలను మరమ్మత్తు చేసి, కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. *- అక్కరపాకు గ్రామస్తులు, దోరవారిసత్రం మండలం*

తిరుపతి జిల్లా, దోరవారిసత్రం మండలం, అక్కరపాకు గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో గ్రామం మొత్తం చీకటిమయంగా మారుతోంది.

గ్రామంలో ప్రధాన వీధుల్లో ఉన్న స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా పాములు, తేళ్ల భయం, దొంగల భయం కూడా నెలకొంది. రాత్రిపూట వాహనదారులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఈ విషయంపై పంచాయతీ అధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలను మరమ్మత్తు చేసి, కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
*- అక్కరపాకు గ్రామస్తులు, దోరవారిసత్రం మండలం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.