Wednesday, 5 August 2026
  • Home  
  • దమ్మపేట మండలంలో రూ.95 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం.. విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే
- భద్రాద్రి కొత్తగూడెం

దమ్మపేట మండలంలో రూ.95 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం.. విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

దమ్మపేట, ఆగస్టు 5: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో రూ.95 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, పసిపిల్లల సంక్షేమం, రవాణా సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మల్కారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గుత్తావారిగూడెంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించి, అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత గుర్వాయిగూడెం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల భద్రత కోసం నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తంగిళ్ల విశ్వనాథ్ తల్లి రాములమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుంజా సుజాత నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గండుగులపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ పనులు గ్రామాల అభివృద్ధికి, ప్రజల రాకపోకలకు మరింత ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్, స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

దమ్మపేట, ఆగస్టు 5: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో రూ.95 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, పసిపిల్లల సంక్షేమం, రవాణా సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
మల్కారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గుత్తావారిగూడెంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించి, అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత గుర్వాయిగూడెం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల భద్రత కోసం నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. అదే గ్రామంలో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తంగిళ్ల విశ్వనాథ్ తల్లి రాములమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుంజా సుజాత నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గండుగులపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ పనులు గ్రామాల అభివృద్ధికి, ప్రజల రాకపోకలకు మరింత ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్, స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.