Sunday, 17 May 2026
  • Home  
  • తిరుపతిలో గంజాయి మాఫియాపై తెదేపా నేతల మండిపాటు
- తిరుపతి

తిరుపతిలో గంజాయి మాఫియాపై తెదేపా నేతల మండిపాటు

శ్రీ కాళహస్తి, మే 17 (పున్నమి టెంపుల్ న్యూస్): ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పరిసరాల్లో గంజాయి వ్యాపారం విస్తరిస్తుండటం ఆందోళనకరమని, దీనికి వైకాపా నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి సంస్థ జాతీయ సంచాలకులు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జి. దశరథాచారి, బీసీ విభాగ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమేష్ రావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి దందా మాఫియాను మించిపోయే స్థాయిలో సాగిందని, యువతను వ్యసనాల బారిన పడేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. తిరుపతి మాజీ ప్రజాప్రతినిధి భూమన కుటుంబ అనుచరుడిగా చెప్పబడుతున్న భాను ఆరు కిలోల గంజాయితో పట్టుబడటం ఈ అక్రమ వ్యవహారాలకు నిదర్శనమని పేర్కొన్నారు. తిరుపతిని గంజాయి ముఠాల నుంచి కాపాడాలంటూ స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అక్కడి పరిస్థితిని స్పష్టం చేస్తోందన్నారు. విద్యార్థులు, యువతను మత్తు పదార్థాల బారిన పడేస్తున్న ఈ దందాలో ఉన్న కీలక వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వన్నెకుల క్షత్రియ సంస్థ సంచాలకులు మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు ఎం. సుబ్బయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బీమాల భాస్కర్ ముదిరాజ్, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు డి.వి. నారాయణ, సామాజిక మాధ్యమాల కన్వీనర్ కోట చంద్రశేఖర్, చిల్లకూరు మణి, గంగనపల్లి రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.