శ్రీ కాళహస్తి, మే 17 (పున్నమి టెంపుల్ న్యూస్): ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి డిపోలో నిర్వహించిన ధర్నా విజయవంతంగా సాగింది. రాష్ట్ర కమిటీ రూపొందించిన 39 డిమాండ్ల మెమోరాండంలోని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారం, సేవా నిబంధనల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.ఎస్. కుమార్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సి. మధు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా డివిజన్ జనరల్ సెక్రటరీ గురువమ్మ, డిపో అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తమ ఆచారి, లింగమూర్తి పాల్గొన్నారు. అలాగే గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు మురళి, రోశయ్య, జిల్లా నాయకులు కె.సి. రెడ్డి, డిపో కమిటీ ప్రతినిధులు కుప్పయ్య, కె. రామకృష్ణ, ఎం.ఎం.సి. బాబు, జి. రామకృష్ణ, సెల్వి కుమార్, పి.ఎస్. ప్రసాద్, గురవారెడ్డి, వెంకటాద్రి, వై.కె. మూర్తి, రమణ, మురళి, మోహన్ బాబు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.

39 డిమాండ్ల సాధనకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల ధర్నా