శ్రీ కాళహస్తి, మే 17 (పున్నమి టెంపుల్ న్యూస్): పేద, మధ్యతరగతి బీసీ కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సెలూన్లు, బార్బర్ షాపులు, రజకుల లాండ్రీ కేంద్రాలు, స్వర్ణకారులు, జీవీఎల్ కుటుంబాలకు నెలకు 100 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం వల్ల చిన్న వ్యాపారులపై విద్యుత్ చార్జీల భారం తగ్గి, వారి జీవనోపాధికి ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, విద్యుత్ మీటర్ బిల్లు వంటి పత్రాలతో తమ పరిధిలోని ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబానికి అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

బీసీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ -ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి