Thursday, 3 September 2026
  • Home  
  • తలకిందులుగా జాతీయ జెండా ఎగురవేత?*
- ఖమ్మం

తలకిందులుగా జాతీయ జెండా ఎగురవేత?*

*తలకిందులుగా జాతీయ జెండా ఎగురవేత?* *ఏన్కూరు* *పోలీస్‌స్టేషన్‌లో* *స్వాతంత్ర్య *వేడుకలపై విమర్శలు* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: దేశ గౌరవానికి ప్రతీకగా భావించే జాతీయ జెండాను ఎగురవేయడంలో జరిగిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వేడుకల్లో జెండా ఎగురవేసిన అనంతరం సంబంధిత అధికారి జెండాను పరిశీలించకుండానే సెల్యూట్ చేసి, జాతీయ గీతం ఆలపించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దేశ జాతీయ జెండా విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. జాతీయ జెండాలో పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు రంగుతో పాటు అశోకచక్రం, దిగువ భాగంలో ఆకుపచ్చ రంగు ఉండేలా నిర్దేశిత విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాథమిక అంశాలపై అవగాహన లేకుండా జెండా ఎగురవేయడం జరిగితే అది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు చట్టాలు, నిబంధనలు వివరించి శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు అధికారులు జాతీయ జెండా విషయంలోనే జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. Uploaded Video:

*తలకిందులుగా జాతీయ జెండా ఎగురవేత?*

*ఏన్కూరు*
*పోలీస్‌స్టేషన్‌లో* *స్వాతంత్ర్య *వేడుకలపై విమర్శలు*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:

దేశ గౌరవానికి ప్రతీకగా భావించే జాతీయ జెండాను ఎగురవేయడంలో జరిగిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

వేడుకల్లో జెండా ఎగురవేసిన అనంతరం సంబంధిత అధికారి జెండాను పరిశీలించకుండానే సెల్యూట్ చేసి, జాతీయ గీతం ఆలపించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

దేశ జాతీయ జెండా విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

జాతీయ జెండాలో పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు రంగుతో పాటు అశోకచక్రం, దిగువ భాగంలో ఆకుపచ్చ రంగు ఉండేలా నిర్దేశిత విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.

అలాంటి ప్రాథమిక అంశాలపై అవగాహన లేకుండా జెండా ఎగురవేయడం జరిగితే అది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలకు చట్టాలు, నిబంధనలు వివరించి శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు అధికారులు జాతీయ జెండా విషయంలోనే జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.