*తగ్గుముఖం పట్టిన చీనీ ధరలు*
అనంతపురం మార్కెట్ యార్డులో శనివారం చీనీ టన్ను గరిష్ఠ ధర రూ.32,500, కనిష్ఠ ధర రూ.10 వేలు, సరాసరి రూ.20 వేలు పలికింది. గురువారం చీనీ టన్ను ధర రూ.40 వేలు, శుక్రవారం రూ.33 వేలకు అమ్ముడుపోయింది. ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి పండిస్తున్నామని, ధరలు ఇలాగే కొనసాగితే నష్టాల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


