డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, దాన్ని అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి అన్నారు. అరకులోయ మండలం సుంకరమెట్టలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరకు సీఐ ఏ. కోటేశ్వరరావు, ఎస్సై టి. మల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటులో నిబంధనలు పాటించి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. రోడ్డు భద్రత, మహిళల రక్షణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి.. డీఎస్పీ పిలుపు