ఖమ్మం రూరల్ ముత్తగూడెం ప్రాంతానికి చెందిన దామల నాగయ్య తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆసుపత్రి బెంచ్‌పై నిద్రించిన నాగయ్య, ఉదయం లేచి చూడగా తన మొబైల్ ఫోన్ కనిపించలేదు. దీంతో ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ ఫోన్‌ను ట్రేస్ చేసి బాధితుడికి తిరిగి అప్పగించారు. దీంతో నాగయ్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.



