Monday, 27 July 2026
  • Home  
  • టీడీపీలో మూడో తరం నాయకత్వం మనోజ్ రెడ్డికే
- తూర్పు గోదావరి

టీడీపీలో మూడో తరం నాయకత్వం మనోజ్ రెడ్డికే

44 ఏళ్లుగా టీడీపీతో నల్లమిల్లి కుటుంబ అనుబంధం: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి ఐక్యతతో 2029లోనూ విజయమే లక్ష్యం పొలమూరు, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నిలిచారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా మనోజ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పొలమూరు ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కూటమి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నల్లమిల్లి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 44 సంవత్సరాల అనుబంధం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి 1983లో టీడీపీ తరఫున అనపర్తి నుంచి పోటీ చేయడంతో ప్రారంభమైన కుటుంబ రాజకీయ ప్రస్థానం నేటి వరకు కొనసాగుతోందన్నారు. గత ఎన్నికల్లో తాను కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించానని పేర్కొన్నారు. టీడీపీకి ఇంచార్జ్ లేని పరిస్థితిని గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మనోజ్ రెడ్డిని పార్టీ కార్యక్రమాల్లో ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు అనేక పార్టీ కార్యక్రమాల్లో టీడీపీ సమన్వయకర్తగా మనోజ్ రెడ్డి చురుగ్గా పనిచేశారని చెప్పారు. అనంతరం త్రిసభ్య కమిటీ నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా మనోజ్ రెడ్డిని ఇంచార్జ్‌గా నియమించినట్లు వివరించారు. నల్లమిల్లి కుటుంబం 44 ఏళ్లుగా టీడీపీతో మమేకమై ఉందని, తాత, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం మనోజ్ రెడ్డికి ఉంటుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం కల్పించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లలో మనోజ్ రెడ్డి అతి పిన్న వయస్కుడిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో రహదారులు, సాగునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి చర్యలు చేపట్టామని రామకృష్ణారెడ్డి తెలిపారు. జన్మభూమి రైల్వే హాల్ట్‌ను సాధించడం, కెనాల్ రోడ్డును అభివృద్ధి చేయడం వంటి పనులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు సాధించామని చెప్పారు. సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వం ముందుందని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘తల్లికి వందనం’ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం అందిస్తున్నామని తెలిపారు. నల్లమిల్లి కుటుంబం అందించిన రాజకీయ సేవలు, పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ మనోజ్ రెడ్డి యువతను కలుపుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలు సాధించేలా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లోనూ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.

44 ఏళ్లుగా టీడీపీతో నల్లమిల్లి కుటుంబ అనుబంధం: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

కూటమి ఐక్యతతో 2029లోనూ విజయమే లక్ష్యం

పొలమూరు, జూలై 27 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నిలిచారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా మనోజ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పొలమూరు ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కూటమి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.

నల్లమిల్లి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 44 సంవత్సరాల అనుబంధం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి 1983లో టీడీపీ తరఫున అనపర్తి నుంచి పోటీ చేయడంతో ప్రారంభమైన కుటుంబ రాజకీయ ప్రస్థానం నేటి వరకు కొనసాగుతోందన్నారు. గత ఎన్నికల్లో తాను కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించానని పేర్కొన్నారు.

టీడీపీకి ఇంచార్జ్ లేని పరిస్థితిని గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మనోజ్ రెడ్డిని పార్టీ కార్యక్రమాల్లో ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు అనేక పార్టీ కార్యక్రమాల్లో టీడీపీ సమన్వయకర్తగా మనోజ్ రెడ్డి చురుగ్గా పనిచేశారని చెప్పారు. అనంతరం త్రిసభ్య కమిటీ నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా మనోజ్ రెడ్డిని ఇంచార్జ్‌గా నియమించినట్లు వివరించారు.

నల్లమిల్లి కుటుంబం 44 ఏళ్లుగా టీడీపీతో మమేకమై ఉందని, తాత, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం మనోజ్ రెడ్డికి ఉంటుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం కల్పించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లలో మనోజ్ రెడ్డి అతి పిన్న వయస్కుడిగా ఉన్నారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో రహదారులు, సాగునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి చర్యలు చేపట్టామని రామకృష్ణారెడ్డి తెలిపారు. జన్మభూమి రైల్వే హాల్ట్‌ను సాధించడం, కెనాల్ రోడ్డును అభివృద్ధి చేయడం వంటి పనులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనమన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు సాధించామని చెప్పారు.

సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వం ముందుందని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘తల్లికి వందనం’ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం అందిస్తున్నామని తెలిపారు.

నల్లమిల్లి కుటుంబం అందించిన రాజకీయ సేవలు, పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ మనోజ్ రెడ్డి యువతను కలుపుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలు సాధించేలా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లోనూ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.