శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం నాడు విశిష్ట సన్మాన కార్యక్రమం జరిగింది. 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి (జడ్జి) లాలస తొలిసారిగా జిల్లా జడ్జి హోదాకు పదోన్నతిపై ఎంపికైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి లాలసకు సాంప్రదాయబద్ధంగా శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి న్యాయవాదులు తమ అభినందనలు తెలియజేశారు. అనంతరం గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ.. చట్టం, న్యాయం పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న లాలస ఉన్నతమైన జిల్లా న్యాయమూర్తి స్థానానికి ఎంపిక కావడం శ్రీకాళహస్తి న్యాయవాద లోకానికి ఎంతో గర్వకారణం మరియు సంతోషదాయకమని కొనియాడారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దివ్య ఆశీస్సులు ఆమెకు ఎల్లవేళలా కలగాలని, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ గౌరవప్రదమైన సన్మాన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా జడ్జిని ఘనంగా సన్మానించిన శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్