జార్ఖండ్‌లో ఆపరేషన్ నవజీవన్ కింద 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో పలువురు కీలక నాయకులు, స్క్వాడ్ సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానంతో ప్రేరణ పొంది లొంగుబాటుకు ముందుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న నేతలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే పలువురు నక్సలైట్లు అరెస్ట్ కాగా, మరికొందరు ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

జార్ఖండ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు