లింగాపూర్, (పున్నమి ప్రతినిది)ఆగస్టు 12, 2026:
లింగాపూర్ మండలంలోని జాములదార గ్రామంలో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ ఆధ్వర్యంలో ఫారం పాండ్లు, ఊట కుంటల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొని లబ్ధిదారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలను అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు మహిళలకు, గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో ప్రత్యేక కమిషనర్, ఆసిఫాబాద్ శాసనసభ్యులు, అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

జాములదారలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
లింగాపూర్, (పున్నమి ప్రతినిది)ఆగస్టు 12, 2026: లింగాపూర్ మండలంలోని జాములదార గ్రామంలో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ ఆధ్వర్యంలో ఫారం పాండ్లు, ఊట కుంటల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొని లబ్ధిదారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలను అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు మహిళలకు, గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక కమిషనర్, ఆసిఫాబాద్ శాసనసభ్యులు, అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

