అనకాపల్లి జిల్లా, జూలై 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక మేజర్ పంచాయతీ సచివాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు, జాతీయ సమైక్యతకు మార్గదర్శకులు, మహోన్నత దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రత, జాతీయత, ఏకాత్మ భావన కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం ఎంపీ సీఎం రమేష్ మరియు అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు దొరపరెడ్డి పరమేశ్వరరావు ఆదేశాల మేరకు బీఎల్ఏ–4 పోలింగ్ బూత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, దేశ ప్రయోజనాల కోసం ఆయన చూపిన అంకితభావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఆయన ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఎలమంచిలి మండల అధ్యక్షులు సన్నంశెట్టి శ్రీను, మొల్లేటి ప్రసాద్, జిల్లా రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, ప్రచార కార్యకర్త ధార నూకరాజు, మహిళా మోర్చా నాయకురాలు వాసపల్లి శైలజ, బీఎల్ఏ సూపర్వైజర్ ప్రకాశ్‌రావు, మాజీ సర్పంచ్ బజంత్రీల శ్రీను, లక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ కర్రి సింహాచలం, నాయకులు రాయి చలపతి, ధారా పోలిశెట్టి, అట్ట అప్పలనాయుడు, గొంతు మూర్తి, బండయ్య, అన్నం ఈశ్వరరావు, డి. గోవిందుతో పాటు సచివాలయ సిబ్బంది నాగరాజు, అసిస్టెంట్ నూకరాజు, రాజు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ శుభ, వీఆర్వో జిలాని, బిల్ కలెక్టర్ రమణ పాల్గొన్నారు.
అలాగే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చూపిన జాతీయవాద భావజాలం, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చడం ద్వారా దేశభక్తి, సేవాభావం మరింత బలోపేతం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం నాయకులు గ్రామ ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కల్పించారు.



