మండల కేంద్రమైన చిట్వేల్‌లోని సింగనమల వీధిలో టంగుటూరి మస్తాన్‌కు చెందిన పూరిల్లు గురువారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పూరిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో రాజంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిట్వేలిలో పూరిల్లు దగ్ధం