కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కాజులూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్,కౌమార దశలో గర్భధారణ, బాల్యవివాహాలు,రక్షణ చట్టాలు,లింగ ఆధారిత హింస,పునరుత్పత్తి ఆరోగ్యం అంశాలపై వకృత్వ మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వకృత్వ మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బీమాబాయి మహిళా మండలి మండల స్థాయి ఇంప్లిమెంటరు డి అర్జునరావు మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రతి ఒక్కరూ సమిష్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ వి అనితాకుమారి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ప్రమాదాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణమ్మ విద్యార్థిని, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలను సమిష్టిగా వ్యతిరేకించాలి