ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నర్సంపేటలో బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మరియు సీతారాం నాయక్ మాట్లాడుతూ… అవినీతి రహిత పాలనతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు.
కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోదీ స్ఫూర్తితో నిర్వహించిన ఈ శిబిరంలో 52 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. రక్తదానం చేసిన యువతకు, సహకరించిన వైద్య బృందానికి మరియు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

నర్సంపేటలో మోదీ జన్మదిన సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నర్సంపేటలో బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మరియు సీతారాం నాయక్ మాట్లాడుతూ… అవినీతి రహిత పాలనతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోదీ స్ఫూర్తితో నిర్వహించిన ఈ శిబిరంలో 52 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. రక్తదానం చేసిన యువతకు, సహకరించిన వైద్య బృందానికి మరియు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

