Wednesday, 8 July 2026
  • Home  
  • చింతపట్ల యువ వైద్యుడికి గాంధీలో అసోసియేట్ ప్రొఫెసర్ పదవి – యాచారం ప్రజలకు ప్రతి శనివారం ఉచిత వైద్య సేవలు
- News

చింతపట్ల యువ వైద్యుడికి గాంధీలో అసోసియేట్ ప్రొఫెసర్ పదవి – యాచారం ప్రజలకు ప్రతి శనివారం ఉచిత వైద్య సేవలు

చింతపట్ల యువ వైద్యుడికి గాంధీలో అసోసియేట్ ప్రొఫెసర్ పదవి – యాచారం ప్రజలకు ప్రతి శనివారం ఉచిత వైద్య సేవలు స్వగ్రామ ప్రజల కోసం ప్రత్యేక సేవలు – ప్రతి శనివారం జ్యోతి హాస్పిటల్‌లో ఉచిత ఎముకలు, కీళ్ల వైద్య పరీక్షలు యాచారం | జూలై 8 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ వి. శేఖర్ గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, కృషి, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ శేఖర్ విజయం యాచారం మండల ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. డాక్టర్ వి. శేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం ఆర్థోపెడిక్స్‌లో ఎంఎస్ పట్టా సాధించి వైద్య రంగంలో విశేష అనుభవాన్ని సంపాదించారు. గతంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించి అనేక మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తాను చదువుకున్న గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, తాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన స్వగ్రామం, స్వప్రాంత ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరువనని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రతి వారం యాచారం ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు యాచారం పట్టణంలోని జ్యోతి హాస్పిటల్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఎముకలు, కీళ్లు, నరాల సంబంధిత వ్యాధులపై కన్సల్టేషన్ ఫీజు లేకుండా పూర్తిగా ఉచితంగా వైద్య పరీక్షలు, సలహాలు అందజేస్తామని తెలిపారు. అవసరమైతే తదుపరి చికిత్స, పరీక్షలు, శస్త్రచికిత్సలపై కూడా తగిన సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎముకలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యం పొందలేకపోతున్నారని డాక్టర్ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తన వంతు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ శేఖర్ నియామకంపై చింతపట్ల గ్రామస్తులు, యాచారం మండల ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు, వైద్య రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. స్వగ్రామం నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయి వైద్య విద్యాసంస్థలో కీలక పదవిని చేపట్టడం యువతకు ఆదర్శమని కొనియాడారు. అదే సమయంలో స్వగ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. యాచారం ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి శనివారం జ్యోతి హాస్పిటల్‌లో నిర్వహించే ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ శేఖర్ కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి. శేఖర్. ప్రతి శనివారం యాచారంలో ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు

చింతపట్ల యువ వైద్యుడికి గాంధీలో అసోసియేట్ ప్రొఫెసర్ పదవి – యాచారం ప్రజలకు ప్రతి శనివారం ఉచిత వైద్య సేవలు

స్వగ్రామ ప్రజల కోసం ప్రత్యేక సేవలు – ప్రతి శనివారం జ్యోతి హాస్పిటల్‌లో ఉచిత ఎముకలు, కీళ్ల వైద్య పరీక్షలు

యాచారం | జూలై 8
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ వి. శేఖర్ గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, కృషి, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ శేఖర్ విజయం యాచారం మండల ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.
డాక్టర్ వి. శేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం ఆర్థోపెడిక్స్‌లో ఎంఎస్ పట్టా సాధించి వైద్య రంగంలో విశేష అనుభవాన్ని సంపాదించారు. గతంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందించి అనేక మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తాను చదువుకున్న గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, తాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన స్వగ్రామం, స్వప్రాంత ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరువనని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రతి వారం యాచారం ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు యాచారం పట్టణంలోని జ్యోతి హాస్పిటల్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఎముకలు, కీళ్లు, నరాల సంబంధిత వ్యాధులపై కన్సల్టేషన్ ఫీజు లేకుండా పూర్తిగా ఉచితంగా వైద్య పరీక్షలు, సలహాలు అందజేస్తామని తెలిపారు. అవసరమైతే తదుపరి చికిత్స, పరీక్షలు, శస్త్రచికిత్సలపై కూడా తగిన సూచనలు ఇస్తామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎముకలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యం పొందలేకపోతున్నారని డాక్టర్ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తన వంతు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
డాక్టర్ శేఖర్ నియామకంపై చింతపట్ల గ్రామస్తులు, యాచారం మండల ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు, వైద్య రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. స్వగ్రామం నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయి వైద్య విద్యాసంస్థలో కీలక పదవిని చేపట్టడం యువతకు ఆదర్శమని కొనియాడారు. అదే సమయంలో స్వగ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
యాచారం ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి శనివారం జ్యోతి హాస్పిటల్‌లో నిర్వహించే ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ శేఖర్ కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి. శేఖర్. ప్రతి శనివారం యాచారంలో ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.