బద్రాద్రి కొత్తగూడెం” చుంచుపల్లి ,మండలం ఆగస్టు,7 (పున్నమి ప్రతినిధి)
పోస్ట్ ఆఫీస్ ప్రాంతం
SBI బ్యాంకు ముందు జరుగుతున్న పనుల కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. వర్షపు నీరు నిలవడంతో బురదగా మారి వాహనదారులు, బ్యాంకుకు వచ్చే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాదచారులు ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డును పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
బురదగా ఉన్న రోడ్డు వల్ల ఒక్క వాహనదారులే కాదు, స్కూల్ పిల్లలు, వృద్ధులు, అంబులెన్స్ కూడా ఆ దారిన వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. స్థానికులు చెబుతున్నారు — “ఇదంతా ఇలానే కొనసాగితే ఏ రోజైన పెద్ద ప్రమాదం జరుగుతది” అని. పనులు మందగించిపోయాయి, ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. ప్రజలు “పనులు త్వరగా పూర్తిచేసి రోడ్డు సరిచేయండి” అని అధికారులను గట్టిగా కోరుతున్నారు.



