Saturday, 3 October 2026
  • Home  
  • *గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధానమంత్రి భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్.ఐపీఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది ఇరువురు మహనీయుల దేశ సేవలను, వారి ఆదర్శాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ గారు సత్యం, అహింసా సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. సత్యం, అహింస, శాంతి, సహనం, నైతిక విలువలకు గాంధీజీ ఇచ్చిన ప్రాధాన్యత నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సరళత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని ఎస్పీ గారు తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రజల్లో ధైర్యం, ఐక్యతను నింపుతూ “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదాన్ని అందించి, దేశ రక్షణలో సైనికుల, దేశాభివృద్ధిలో రైతుల పాత్రను చాటి చెప్పారని అన్నారు. శాస్త్రి గారి నిరాడంబర జీవనం, ఉన్నత నైతిక విలువలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్బి డీఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, ఏ ఆర్ డిఎస్పీ శ్రీ వి జి శ్రీహరి రావు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొని మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధానమంత్రి భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్.ఐపీఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది ఇరువురు మహనీయుల దేశ సేవలను, వారి ఆదర్శాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ గారు సత్యం, అహింసా సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. సత్యం, అహింస, శాంతి, సహనం, నైతిక విలువలకు గాంధీజీ ఇచ్చిన ప్రాధాన్యత నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి సరళత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని ఎస్పీ గారు తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రజల్లో ధైర్యం, ఐక్యతను నింపుతూ “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదాన్ని అందించి, దేశ రక్షణలో సైనికుల, దేశాభివృద్ధిలో రైతుల పాత్రను చాటి చెప్పారని అన్నారు. శాస్త్రి గారి నిరాడంబర జీవనం, ఉన్నత నైతిక విలువలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్బి డీఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, ఏ ఆర్ డిఎస్పీ శ్రీ వి జి శ్రీహరి రావు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొని మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.