Tuesday, 21 July 2026
  • Home  
  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం కోరిన మాజీ ఇన్‌చార్జ్ వి.ఎస్. అమీర్ బాబు
- కడప

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం కోరిన మాజీ ఇన్‌చార్జ్ వి.ఎస్. అమీర్ బాబు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం కోరిన మాజీ ఇన్‌చార్జ్ వి.ఎస్. అమీర్ బాబు అమరావతి, జూలై 21 (మన ధ్యాస): తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ వి.ఎస్. అమీర్ బాబు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలని ముఖ్యమంత్రిని అమీర్ బాబు కోరినట్లు సమాచారం. 2024 ఎన్నికల సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ లభించకపోయినప్పటికీ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని, మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అదేవిధంగా గతంలో తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని అమీర్ బాబు కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అమీర్ బాబు విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల నేపథ్యంలో అమీర్ బాబు పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానం కోరిన మాజీ ఇన్‌చార్జ్ వి.ఎస్. అమీర్ బాబు

అమరావతి, జూలై 21 (మన ధ్యాస): తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ వి.ఎస్. అమీర్ బాబు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలని ముఖ్యమంత్రిని అమీర్ బాబు కోరినట్లు సమాచారం. 2024 ఎన్నికల సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ లభించకపోయినప్పటికీ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని, మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

అదేవిధంగా గతంలో తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని అమీర్ బాబు కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అమీర్ బాబు విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల నేపథ్యంలో అమీర్ బాబు పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.