శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలంలోని నారాయణపురం గ్రామంలో బుధవారం గంగమ్మ జాతర అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రైతులు, పాడి రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ యువజన అధ్యక్షుడు మల్లెంబాకం ముని కృష్ణారెడ్డితో పాటు ప్రముఖ నాయకులు, గ్రామస్తులు రత్నం రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, వసంత రామ్ రెడ్డి, ముని కుమార్ రెడ్డి, ఆదిరెడ్డి, మునిరాం రెడ్డి, కేశవరెడ్డి, పరంధామ రెడ్డి, కుమార్, చింతకాయల సుధాకర్ రెడ్డి, భక్త ఉత్సవాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మ జాతరలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు