భూపాలపల్లి, జూలై 19 (పున్నమి న్యూస్ ప్రతినిధి) : బూత్ స్థాయిలో చేపట్టిన Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ప్రత్యేక గుర్తింపు కల్పించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది.100 శాతం లక్ష్యాన్ని సాధించిన BLAలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేక ఫోటో సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రతి BLA ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయించడం, అవసరమైన సహాయం అందించడం, BLA డైలీ యాక్టివిటీ ట్రాకర్‌ను ప్రతిరోజూ నవీకరించడం ద్వారా SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది.
పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి BLA సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కోరారు.
SIR కార్యక్రమాన్ని 100% పూర్తి చేసిన BLAలకు ప్రత్యేక గుర్తింపు
భూపాలపల్లి, జూలై 19 (పున్నమి న్యూస్ ప్రతినిధి) : బూత్ స్థాయిలో చేపట్టిన Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ప్రత్యేక గుర్తింపు కల్పించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది.100 శాతం లక్ష్యాన్ని సాధించిన BLAలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేక ఫోటో సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ప్రతి BLA ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయించడం, అవసరమైన సహాయం అందించడం, BLA డైలీ యాక్టివిటీ ట్రాకర్‌ను ప్రతిరోజూ నవీకరించడం ద్వారా SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి BLA సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కోరారు.

