Wednesday, 16 September 2026
  • Home  
  • ఖర్గే సభ అనంతరం శుద్ధీకరణపై ఫిర్యాదు
- నిర్మల్

ఖర్గే సభ అనంతరం శుద్ధీకరణపై ఫిర్యాదు

ముథోల్, ఆగస్టు 31(పున్నమి ప్రతినిధి ):కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం హల్ద్వానీలోని రామలీలా మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎస్సీ సెల్ ముథోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జోందలే విశ్వంభర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. కుల వివక్ష, అంటరానితనానికి సంబంధించిన అంశాలు నిజమని తేలితే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ముథోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై బిట్ల పెర్సిస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, కార్యదర్శి బషిర్, మండల అధ్యక్షుడు కిష్టయ్య, మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ మాక్ధూమ్, మాజీ సర్పంచులు సాయినాథ్, గౌతమ్, నాయకులు సంజు, సమీ, ధర్మేందర్, జావీద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.