ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ సూచనల మేరకు ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 43, 50, 52, 53, 54 డివిజన్లకు ఇన్‌చార్జిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శ్రీరక్ష హాస్పిటల్ అధినేత గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖమ్మం 53వ డివిజన్‌లో SIR నమోదు–సవరణ సహాయ కేంద్రం (SIR Help Desk) ప్రారంభించారు.
ఈ అవకాశం ని ప్రజలు సద్విని యోగం చేసుకొని తమ ఓటు ని నమోదు చేసుకోవాలని ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ విజ్ఞప్తి చేసారు.
53వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ ధనియాకుల శ్రీలత, 53వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్‌చార్జి దాసరి వీరభద్రం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధనియాకుల వెంకట్ నారాయణ మాట్లాడుతూ, ప్రతి పౌరుడికి ఓటు హక్కు అత్యంత విలువైనదని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు చేసుకోవాలని కోరారు. డివిజన్ ప్రజలకు SIR దరఖాస్తు ఫారాలు అందజేస్తూ, నమోదు ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోతీలాల్, కాసం మమత, కిన్నెర సాయి, వాసం వెంకటేష్, మల్లికార్జున్, గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..



